శ్రీనువైట్లకు చిరు పెట్టిన కండీషన్ ఏమిటి?
on Nov 6, 2014
.jpg)
అటకెక్కిపోయిందనుకొన్న శ్రీనువైట్ల - రామ్ చరణ్‌ల సినిమా ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరగబోతోంది. ఈ సినిమా మళ్లీ మొదలవ్వడానికి కారణం చిరంజీవి అని టాలీవుడ్ టాక్. శ్రీనువైట్ల చిరుకి వీరాభిమాని. వీరిద్దరి కాంబినేషన్‌లో అందరివాడు వచ్చింది. కానీ అది ఫ్లాప్. అయినా సరే, ఈ బంధం కొనసాగుతోంది. ఆగడు ఫ్లాప్ తరవాత శ్రీనువైట్లని చరణ్ దూరం పెట్టాలనుకొన్నాడ్ట. దాదాపుగా శ్రీనువైట్లకి బై చెప్పేశాడట. చరణ్ హ్యాండిస్తే, తన పరిస్థితి దారుణంగా తయారవుతుందని గమనించిన శ్రీనువైట్ల.. వెంటనే చిరుని సంప్రదించాడు. ''అన్నయ్యా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను ప్రూవ్ చేసుకొంటా'' అని విన్నవించుకొన్నాడు. శ్రీనువైట్ల టాలెంట్ తెలిసిన చిరు.. శ్రీనువైట్లని నమ్మాడు. చరణ్‌తో సినిమా నేను పట్టాలెక్కిస్తా... అని భరోసా ఇచ్చాడు. అయితే ఒక్క షరతు మాత్రం విధించాడట. అతి తొందర్లో పూర్తి స్ర్కిప్టు పట్టుకురమ్మన్నాడట. దానికి శ్రీనువైట్ల కూడా సరే అన్నాడు. ఇప్పుడు శ్రీను దగ్గరున్న ఏకైక మార్గం మంచి కథతో చిరుని ఒప్పించడమే. అందుకే శ్రీను స్ర్కిప్టు పనుల్లో తలమునకలై ఉన్నాడట. చరణ్‌కి అదిరిపోయే కథ చెప్తా... అంటున్నాడట. ఇటు చరణ్‌కీ, అటు చిరుకి కావల్సింది అదే కదా..?? మరి శ్రీనువైట్ల ఎలాంటి కథతో వస్తాడో, ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



