ప్రముఖ నటి మాధవీలతపై కేసు నమోదు..!
on Dec 29, 2025

ప్రముఖ నటి మాధవీలత(Madhavi Latha)కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది.
సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారి పోస్ట్ లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు.. మాధవీలతతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసు విషయంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మాధవీలతతో పాటు మిగతా యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లును సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని పోలీసులు తెలిపారు.
Also Read: విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!
అలాగే, ఇటువంటి పోస్ట్ లు పెడుతున్న పలు సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసినా, అభ్యంతరకర పోస్టులు పెట్టినా.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



