కృతి శెట్టి మూవీతో హ్యాట్రిక్ దక్కేనా!
on Dec 10, 2021
రాజ్ తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన `ఉయ్యాలా జంపాలా`(2013)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు విరించి వర్మ. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆపై నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో `మజ్ను` (2016) తీశాడు. ఈ సినిమా కూడా విజయతీరాలకు చేరుకుంది. అలా.. తొలి, మలి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు విరించి.
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. సీతను పొట్టలో తన్నిన బ్రిటీష్ ఆఫీసర్!
కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ కెప్టెన్ ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. `ఉప్పెన` చిత్రంతో తెలుగు తెరకు నాయికగా పరిచయమైన కృతి శెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట విరించి వర్మ. నాయికా ప్రాధాన్యమున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించనుందని సమాచారం. త్వరలోనే కృతి - విరించి కాంబో మూవీపై క్లారిటీ రానున్నది. మరి.. `ఉయ్యాలా జంపాలా`, `మజ్ను` చిత్రాల తరువాత విరించి నుంచి రానున్న ఈ సినిమా అతనికి హ్యాట్రిక్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
కాగా, కృతి త్వరలో `శ్యామ్ సింగ రాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో పలకరించబోతోంది. మరోవైపు `మాచర్ల నియోజక వర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ - లింగుస్వామి బైలింగ్వల్ మూవీతో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ బిజీగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
