c/o సూర్య ట్రైలర్ రివ్యూ
on Nov 3, 2017
‘ట్రైలర్స్ చూసి మోసపోకండి’.. అనే మాట నిజమే కానీ.. కొన్ని ట్రైలర్స్ చూస్తే మాత్రం.. సినిమా చూడకుండా ఉండలేం. రీసెంట్ గా ఓ ట్రైలర్ వచ్చింది. సినిమా పేరు ‘c/o సూర్య’ . ఈ ట్రైలర్ చూస్తే... సేమ్ ఫీలింగ్. సందీప్ కిషన్ హీరో. ‘నా పేరు సూర్య’ ఫేం సుసీందరన్ దర్శకుడు. ట్రైలర్లో కనిపించిన పాత్రలన్నీ.. సమకాలీన సమాజంలో మనకు బాగా పరిచయమైన పాత్రల్లాగే ఉన్నాయ్. హీరో కేరక్టరైజేషన్ అయితే.. నేటి యూత్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. అన్నకు సొంత చెల్లెలే డబ్బులు వడ్డీకివ్వడంం.. సరిగ్గా చదవడం లేదని అమ్మ తిట్టడం.. ఫ్రెండ్ ఎంత వెధవైనా.. ‘మా వాడు చాలా గొప్ప’ అని చెప్పుకునే మరో ఫ్రెండ్. ఫ్రెండ్ కోసం ప్రాణాలను సైతం అడ్డపెట్టే మరో స్నేహితుడు... ‘ఫోన్ ఎత్తకపోతే.. ఇంటికొచ్చి కొడతా’ అని బెదిరించే ప్రియురాలు.. ఇవన్నీచూస్తుంటే సినిమాను ఇమిడియట్ చూసేయాలనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ రీ రికార్డింగ్ సూపర్. ‘ముత్తు’లో రజనీకాంత్ డైలాగ్ ‘యచ్చచ్చ యచ్చచ్చ.. గచ్చచ్చ గచ్చచ్చ’ సౌండ్ ని నేపథ్య సంగీతంలా వాడుకోవడం వైరైటీగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే.. కథానాయిక మెహ్రిన్ కి హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అయ్యేట్టుంది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.