అందరి చూపులు వారిద్దరివైపే!
on Sep 25, 2017

ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులకు రకరకాల అనుభూతుల్నే అందించింది. హౌజ్ లో ఒకప్పుడు కలిసి ఉన్నవాళ్లు... స్టేజ్ పై కలవడం ఓ వైరైటీ ఫీలింగ్. వాళ్ల ఎక్స్ ప్రెషన్స్ ని కూడా జనాలు ఎంజాయ్ చేశారు. హౌజ్ ని ముందే వదిలేసి వెళ్లిపోయిన వారు స్టేజ్ పై కనిపించడం... చివరిగా మిగిలిన అయిదుగురూ ఒక్కొక్కరూ స్టేజ్ పైకి రావడం... పాత కంటెస్టెంట్స్ ని కలవడం.. ఇదంతా భిన్నమైన అనుభవం. ‘విజేతలం మేమే’ అని అప్పటిదాకా నమ్మకంగా ఉన్నవాళ్లు... హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి.... పాత కంటెస్టెంట్స్ సరసన కూర్చోవాల్సి వచ్చినప్పుడు వాళ్ల ముఖాల్లో ఏదో తెలీని బాధ కనిపించింది. అలాగే... ఇప్పటిదాకా ‘బిగ్ బాస్’ హౌజ్ లో ఉండి... చివరకు తమ సరసకే ఒక్కొక్కరూ చేరుతుంటే... పాత కంటెస్టెంట్స్ లో తెలీని ఆనందం కనిపించింది. ముఖ్యంగా హరితేజా... ‘అమ్మో... మళ్లీ వాళ్ల పక్కకెళ్లి కూర్చోవాలంటే భయం వేస్తుంది’ అని పొరపాటున బయటకే అనేసింది. ఇక ఆదర్స్... ప్రిన్స్.... ‘బిగ్ బాస్’ హౌజ్ లో చివరిదాకా ఉండేవాళ్లలో తప్పకుండా ఉంటాడనుకున్న ప్రిన్స్... అనుకోకుండా 60 ఎపిసోడ్ల తర్వాత బయటకొచ్చేశాడు. తాను ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆదర్షే అని స్టేజ్ పై అందరికీ చెప్పేశాడు కూడా.
ఈ విషయంలో ఎన్టీయార్ కూడా ఆదర్ష్ విషయంలో సీరియస్ గా వ్యవహరించాడు. అసలు ప్రిన్స్, ఆదర్ష్ మధ్య ఏం జరిగింది? అనేది మాత్రం ఇప్పటివరకూ కూడా ప్రశ్నలాగే మిగిలిపోయింది. అయితే.. పాత కంటెస్టెంట్స్ అందరూ మొన్నామధ్య ‘బిగ్ బాస్’ హౌజ్ లోకి వచ్చినప్పుడు... ఆదర్ష్, ప్రిన్స్ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. స్టేజ్ పై తన పేరు చెప్పడానికి వేరే కారణం ఉందని కూడా ప్రిన్స్.. ఆదర్ష్ తో చెప్పాడు. వారిద్దరూ ఆటను ఆటలాగే తీసుకున్నట్టు ప్రస్ఫుటంగా కనిపించింది. ఎట్టకేలకు ‘బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే’లో రెండో స్థానంలో నిలిచిన ఆదర్ష్... హౌజ్ నుంచి బయటకొచ్చాడు. ఇప్పుడు ఆదర్ష్ పాత కంటెస్టెంట్స్ తో కలిసి కూర్చోవాలి. మరి ఎక్కడ కూర్చుంటాడు? ఎవరి పక్కన కూర్చుంటాడు? తన పాత మిత్రుడు ప్రిన్స్ పక్కకు వెళతాడా? అని జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే... అలాంటివేం అక్కడ జరగలేదు. అందరి చూపులు మాత్రం ఆదర్ష్, ప్రిన్స్ లపైనే ఉన్నాయ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



