ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్!
on May 4, 2024
స్టార్ హీరోల బర్త్ డే అంటే ఆ సందడే వేరు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు. ఆరోజు ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన పలు అప్డేట్ లు.. అభిమానులను సర్ప్రైజ్ చేయనున్నాయి.
ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' (Devara), 'వార్ 2' (War 2) సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక ప్రకటన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న రానుందట. దీనితో పాటు 'దేవర', 'వార్ 2' అప్డేట్స్ కూడా రానున్నాయట. 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్, 'వార్ 2' నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నాయని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ బర్త్ డేకి మూడు సినిమాల అప్డేట్స్ తో.. ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఉండనుంది అన్నమాట.
Also Read