రామ్ తో డేటింగ్ వార్తలపై ఉంగరంతో క్లూ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే!
on Apr 21, 2025

'మిస్టర్ బచ్చన్' తో సినీ ఆరంగ్రేటం చేసిన నార్త్ ఇండియన్ బ్యూటీ 'భాగ్యశ్రీ బోర్సే'. (Bhagyashri Borse)తొలి సినిమాతోనే తన అందంతో, పెర్ ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. అందుకే మిస్టర్ బచ్చన్ పరాజయంతో సంబంధం లేకుండా భాగ్యశ్రీకి వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)విజయ్ దేవరకొండ(VIjay Devarakonda)వంటి హీరోల సరసన చేస్తు ఫుల్ బిజీగా ఉంది.
సోషల్ మీడియా(Social Media)లో గత కొన్ని రోజుల నుంచి రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే డేటింగ్ లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతు ఉన్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా రామ్, భాగ్యశ్రీ సోషల్ మీడియా వేదికగా తమ పిక్స్ షేర్ చేసారు. ఆ పిక్స్ లోని బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండటంతో ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఒకే గదిలో ఫోటో దిగారా అంటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే భాగ్యశ్రీ చేతికి ఉన్న ఉంగరాన్ని గమనించి, మీ చేతికి ఉన్న ఉంగరం బాగుంది, ఎవరు తొడిగారనే ప్రశ్న వేసాడు. అందుకు భాగ్యశ్రీ రిప్లై ఇస్తు 'నేనే కొనుక్కున్నానని' ఆన్సర్ ఇచ్చింది. రామ్, భాగ్యశ్రీ మధ్య డేటింగ్ వార్తలు వస్తున్న టైంలో ఆమె ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.
రామ్, భాగ్యశ్రీ ప్రస్తుతం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్(Mahesh p)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ, కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలైతే మూవీపై రామ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలగచేస్తున్నాయి. సాగర్, మహాలక్ష్మి క్యారక్టర్ లలో ఆ ఇద్దరు కనిపించనున్నారు. హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)హై బడ్జెట్ తో నిర్మిస్తుండగా, తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన వివేక్,మెర్విన్(Vivek, mervin)ద్వయం మ్యూజిక్ ని అందిస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



