బెంగాల్ టైగర్ కి U/A వచ్చింది
on Dec 2, 2015
.jpg)
మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ బెంగాల్ టైగర్ సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యుఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 10న రిలీజ్ కి సిద్దమవుతోంది. కిక్ 2 లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా తరువాత రవితేజకి ఈ బెంగాల్ టైగర్ ఎంతో కీలకమని చెప్పాలి. ఇప్పటికే టీజర్ కి చక్కని రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి మాస్ రాజాలోని ఎనర్జీని సంపత్ పీక్స్ లో వినియోగించాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. పూర్తిగా బి సి సెంటర్ల నుంచి రాజాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయన్న అంచనా వేస్తున్నారు. అలాగే తమన్నా రాశి ఖన్నాలు రెచ్చిపోయి అందాలను ఆరబోశారట. మరి పోటీ అనేదే లేకుండా సోలోగా వేటకు దిగుతున్న టైగర్ .. మాస్ మహారాజ్ కోరుకుంటున్న హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



