ఆర్ ఎక్స్ దర్శకుడుతో బెల్లంకొండ సినిమా!!
on Jan 3, 2019

`ఆర్ ఎక్స్` 100 సినిమాతో డైరక్టర్ మంచి పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి తదుపరి సినిమా పై ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, రామ్ తో సినిమా చేయబోతున్నట్లు, స్క్రిప్టు కూడా రెడీ చేస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రావడంతో ...ఆయన తదుపరి సినిమా రామ్ లేనట్టే...బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తోనే అన్న వార్తలు ప్రస్తుతం మీడియాలో వస్తున్నాయి. అందులో రామ్ కూడా పూరి జగన్నాథ్ సినిమాతో బిజీ అవుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే అజయ్ భూపతి కి నో చెప్పడమో..మరేదో జరిగి ఉంటుందన్నది ఫిలిం నగర్ లో వార్తలు. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ తో ఒక సినిమా కమిటయ్యాడు.ఈ కమిట్ మెంట్స్ తర్వాతే అజయ్ భూపతి సినిమా ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



