ENGLISH | TELUGU  

మహేష్ సినిమా కోసం....బిగ్ బాస్ వదులుకున్నాడా ?

on Jun 11, 2019

 

గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడాయి అధికార టీఆరెస్ - కాంగ్రెస్ - టీడీపీ కూటమి. ఆ సమయంలో అనూహ్యంగా రాజకీయాల్లో చేరి ఆ మొత్తం ఎన్నికల ఎపిసోడ్ కి రిలీఫ్ పాయింట్ గా మారారు ఒకప్పటి కమెడియన్, ఆ తర్వాత సినీ నిర్మాత అయినా బండ్ల గణేష్, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లెడ్ తో గొంతు కోసుకుంటానని ఒక మీడియా ఛానెల్ ముందు సవాల్ చేసిన ఆయన టీఆరెస్ గెలవగానే కొద్దిరోజులు పత్తా లేకుండా పోయాడు, అయితే ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల నుండి వైదొలుగుతున్నానని ప్రకటించి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. అయితే ఇప్పటికీ ఆయన బ్లెడ్ గణేష్ గా సోషల్ మీడియాలో చాలా ఫెమస్ అయ్యారు. అంత ఫెమస్ అయితే బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు వదులుకుంటారు ? అందుకే త్వరలో మొదలు కానున్న తమ సీజన్ త్రీలో పాల్గొనమని అడిగారట, ఆయన సోషల్ మీడియా క్రేజ్ దృష్ట్యా మంచి ఫాన్సీ అమౌంట్ కూడా రెమ్యునరేషన్ గా ఆఫర్ చేశారట.

అయితే ముందు ఈ విషయం విని ఒకే చెప్పేసిన బండ్ల రూల్స్ విన్నాక మాత్రం కళ్ళు తేలేసారట, అన్ని రోజులు ఫోన్ లేకుండా తాను ఉండలేనని ఆయన ఖరాఖండిగా చెప్పేశారట. నిజానికి బండ్ల మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాని హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా దానికి సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా స్వారా విజయశాంతి రీ ఎంట్రీ కన్ఫామ్ కాగా బండ్ల రీ ఎంట్రీ విషయం మీద మాత్రం సందిగ్దత కొనసాగుతోంది. అయితే ఈ సినిమా కోసమే ఆయన బిగ్ బాస్ కి నో చెప్పారని కూడా ప్రచారం మొదలయ్యిందనుకోండి అది వేరే విషయం. ఇక ఈ సరి బిగ్ బాస్ సీజన్ ని మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు, రెండో సీజన్ లో పెద్దగా ఫేమ్ లేని వాళ్ళతో టీఆర్ఫీ నష్టపోయిన నిర్వాహకులు ఈ సారి మాత్రం ఆ విషయంలో దెబ్బ పడకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదా, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినా వాళ్లనే ఈ సీజన్ లోకి తీసుకునేలా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.