లోకేష్ ని కలిసిన బండ్ల గణేష్ ..అసలు ఏం జరుగుతుంది!
on Oct 27, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వీరాభిమానిగా ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మైక్ పట్టుకొని ఒక అంశంపై స్పీచ్ ఇచ్చాడంటే ఆ మాటల తూటాల తాలూకు దెబ్బకి అగ్ర రచయితల పెన్ను నుంచి వచ్చే డైలాగులు కూడా సరితూగవు. అంతలా తన పంచులతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాడు. సదరు స్పీచ్ కూడా నిమిషాల్లో వైరల్ గా మారడం కూడా బండ్ల గణేష్ స్పెషాలిటీ. అసలు బండ్ల గణేష్ ఒకర్ని కలిసాడంటే వాళ్ళతో ఏం మాట్లాడి ఉంటాడు అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంటుంది.
నిన్న బండ్ల గణేష్ కడప(kadapa)జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్(Cherukuri Sridhar)కుమారుడి వివాహానికి హాజరయ్యాడు. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంగళగిరి శాసనసభ్యులు, ఐటి శాఖ మినిస్టర్ శ్రీ నారా లోకేష్(Nara lokesh)గారు హాజరయ్యి వధూవరుల్ని ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని బండ్ల గణేష్ కలిసి ఆప్యాయంగా మాట్లాడటం జరిగింది. లోకేష్ గారు కూడా బండ్ల గణేష్ ని ప్రోత్సహిస్తునట్టుగా భుజంపై చేయి వేసి మాట్లాడారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నారా లోకేష్ గారితో బండ్ల గణేష్ ఏం మాట్లాడాడు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ బండ్ల గణేష్ తన దైన స్టైల్లో నిరసనని వ్యక్తం చేసాడు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీ తో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



