బాలయ్య సరసన క్రేజీ హీరోయిన్?
on Oct 14, 2017
బాలయ్యతో జోడీ కట్టడమంటే... ఇప్పట్లో హీరోయిన్లకు పండగ. అదో గోల్డెన్ ఆఫర్ గా ఫీలయ్యేవారు. కానీ... నేటి పరిస్థితి అలా లేదు. ఆయన వయసు పెద్దదవ్వడం... ఇప్పుడున్న క్రేజీ హీరోయిన్లందరూ పాతికేళ్ల లోపు వాళ్లే అవ్వడం... పైగా బాలయ్యతో జతకట్టడమంటే.. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయ్. వాటన్నింటికీ తలొగ్గే పరిస్థితుల్లో ఇప్పటి అమ్మాయిలకు లేరు. దాంతో... బాలయ్యకు కొన్నాళ్ల నుంచి హీరోయిన్ల కొరత మొదలైంది. నయనతార, శ్రియ.. ఇద్దరే బాలయ్యతో చేయడానికి ముందుకొస్తున్నారు తప్ప.. మిగిలిన హీరోయిన్లు బాలయ్య అంటే.. భయపడిపోతున్నారు.
ఇదిలావుంటే... ప్రస్తుతం నటసింహం.. కేఎస్ రవికుమార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే.. కథ రిత్యా ఇందులో మరో కథానాయికకు స్థానం ఉంది. ఆ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా? అని కొన్ని రోజులుగా దర్శక, నిర్మాతలు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ముందు ఆ అవకాశం.. ప్రగ్యా జైశ్వాల్ ని వరించింది. ఆమె దాదాపు ఖరారైందనుకుంటున్న సమయంలో... ప్రగ్యాను వెనక్కకు నెట్టి.. రెజీనా ఆ పాత్రకు ‘ఓకే’ అయ్యింది. బాలయ్య పక్కన నటించడానికి యంగ్ హీరోయిన్లు కూడా పోటీ పడటం ఈ మధ్య జరగలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు కుర్ర హీరోయిన్లు పోటీ పడిటం.. రెజీనా ఆ పాత్రకు సెలక్ట్ అవ్వడం నిజంగా ఆసక్తికరమైన విషయమే.
రేపు రెజీనా, బాలయ్యల చిందులు.. బాక్సాఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



