బాలయ్య కీలక ప్రకటన.. మోక్షజ్ఞ మొదటి సినిమా మారింది!
on Mar 31, 2025
తెలుగు సినీ చరిత్రలో మొదటి టైమ్ ట్రావెల్ చిత్రం 'ఆదిత్య 369'. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, 1991లో విడుదలై సంచలన విజయం సాధించింది. మూడు దశాబ్దాల తర్వాత ఈ క్లాసిక్ ఫిల్మ్ కి సీక్వెల్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. (Adity 369)
'ఆదిత్య 369' మూవీ ఏప్రిల్ 4న రీ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ కథ రెడీగా ఉందని, త్వరలోనే సినిమా చేస్తామని అన్నారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. (Balakrishna)
నిజానికి ఆదిత్య 369 సీక్వెల్ ని బాలకృష్ణ తన దర్శకత్వంలోనే చేయాలని భావించారు. ఈ మూవీతో తన తనయుడు మోక్షజ్ఞను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ, ఎందుకనో ఈ సీక్వెల్ కి కొబ్బరికాయ కొట్టలేదు. ఓ వైపు బాలకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ మొదటి సినిమాని హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రకటించారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్ ఇప్పట్లో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఈ సీక్వెల్ మళ్ళీ తెరపైకి వచ్చింది.
'ఆదిత్య 369' రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాటలను బట్టి చూస్తే, సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని అనిపిస్తోంది. పైగా ప్రశాంత్ వర్మ కూడా ప్రస్తుతం 'జై హనుమాన్'తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. మోక్షజ్ఞ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో ఆదిత్య 369 సీక్వెల్ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. మరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఇదే అవుతుందేమో చూడాలి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
