నిర్మాతలతో బాలయ్య, బోయపాటి భేటీ.. రిలీజ్ పై మరికాసేపట్లో ప్రకటన
on Dec 5, 2025

బాలయ్య, బోయపాటి భేటీ
ఏం మాట్లాడారు
రిలీజ్ ఎప్పుడు!
బాలయ్య(Balakrishna),బోయపాటి శ్రీను(Boyapati Srinu)కాంబోకి ఉన్నక్రేజ్ కి కొలమానాలు లేవు. ఆ ఇద్దరి కాంబోలో సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు. భారీ అభిమాన గణం కూడా ఆ ఇద్దరి కాంబో సొంతం. దీన్ని బట్టి ఆ ఇద్దరి ప్రీవియస్ చిత్రాలు ఎంతగా ప్రభావం చూపించాయో అర్ధం చేసుకోవచ్చు. దీంతో అఖండ 2(Akhanda 2)కోసం అందరు ఎంతో ఆశతో ఎదురుచూసారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా నిన్న ప్రీమియర్స్ కి వెళ్లకపోవడంతో పాటు ఈ రోజు ఇంకా థియేటర్స్ లో అడుగుపెట్టలేదు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటి అఖండ 2 నిర్మాతలైన ఆచంట గోపినాధ్, రామ్ లతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో రిలీజ్ కి ఏర్పడిన ఆటంకాలని తొలగించబోతున్నట్టుగా సమాచారం. దీంతో మరికాసేపట్లో రిలీజ్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా టాక్. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ తో అభిమానులు సంతోషంగా ఉన్నారు.
Also Read: ప్రాబ్లమ్స్ క్లియర్.. క్లారిటీ వచ్చిన అఖండ 2 షోస్ డిటైల్స్ ఇవే
అదే సమయంలో వాళ్ళు స్పందిస్తు ఈ రోజు రాత్రి నుంచైనా బెనిఫిట్ షోస్ ప్రదర్శించేలా చూడాలని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా రిలీజ్ టైం విషయంలో సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా బాలయ్య, బోయపాటి లని కోరుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



