బాలకృష్ణ... బోయపాటి...ఈ రోజు నుండి మళ్ళీ మొదలు!
on Oct 29, 2020
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'సింహ', 'లెజెండ్' బ్లాక్ బస్టర్ విజయాల తరవాత వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా ఇది. గురువారం ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభించారు.
కరోనా కారణంగా మార్చి నెలాఖరు నుండి అన్ని సినిమా చిత్రీకరణలకు బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి బాలకృష్ణ-బోయపాటి (బిబి3) చిత్రీకరణకు సైతం బ్రేకులు పడింది. మధ్యలో చిత్రీకరణ పునః ప్రారంభించడానికి బాలకృష్ణ సంసిద్ధత వ్యక్తం చేసినా... కరోనా పరిస్థితుల దృష్ట్యా సినిమా యూనిట్ షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఈ రోజు నుండి మళ్ళీ మొదలుపెట్టారు.
ఆల్రెడీ విడుదలైన 'బిబి 3' టీజర్ నందమూరి అభిమానులు సహా తెలుగు సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Also Read