'బాహుబలి' vs 'భజరంగీ భాయ్ జాన్'.. గెలుపెవరిది
on Jul 24, 2015
ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా రెండు సినిమాల గురించి చర్చలు బాగా జరుగుతున్నాయి. అవి 'బాహుబలి' ఒకటి.. ఇంకొకటి భజరంగీ భాయ్ జాన్. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలకు స్టోరీ రైటర్ ఒకరే.. అది జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్దు కాసుల వర్షం కురుస్తున్నాయి. ఇంతవరకూ పెద్దగా రాజమౌళి తండ్రి గురించి కొంత మందికి తెలిసినా.. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ 'బాహుబలి' vs 'భజరంగీ భాయ్ జాన్' లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యింది అని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన 'బాహుబలి' మొదటి ఆరు రోజుల్లో 285 కోట్లు సాధించగా 'భజరంగీ భాయీజాన్' 169 కోట్లు సాధించింది. ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఎవ్వరిది పైచేయిగా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 'బాహుబలి', 'భజరంగీ భాయీజాన్' మూవీల మధ్య పోటీ గట్టిగానే ఉందని సినీ విశ్లోషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టవుతుందో తెలియదు కానీ.. ఈ సినిమాల వల్ల విజయేంద్ర ప్రసాద్ సూపర్ హిట్టయ్యాడని మాత్రం తెలుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
