బాహుబలి వెనుక రాజకీయ హస్తం ఉందా?
on Apr 27, 2017

ఈమధ్య ఏ పెద్దసినిమాకీ ప్రీమియర్ షోలకు అనుమతి లభించలేదు. కానీ బాహుబలి 2 కి మాత్రం అనూహ్యంగా ఫ్యాన్స్‌షోలకు గ్రీన్‌సిగ్నల్ లభించేసింది.అదీ... రాత్రి 9.30 నుంచే షోలు వేసుకోవొచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? ఎవరి మ్యాజిక్ ఫలించింది? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్ షోల వెనుక తెలంగాణ ప్రభుత్వ అండదండలున్నట్టు టాక్. బాహుబలి 2 రైట్స్‌ని నైజాంలో ఏసీయన్ థియేటర్స్ సంస్థ తీసుకొన్న సంగతి తెలిసిందే. ఏసియన్ వాళ్లనుంచి ఓ రాజకీయ వేత్త కుమారుడు భారీ మొత్తానికి ప్రీమియర్ షో రైట్స్ సంపాదించాడట.
మరోవైపు స్పెషల్ షోలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా... తొమ్మిదిన్నరకు పడాల్సిన షోలు పడిపోతాయని, అపే నాథుడే ఉండడని కూడా చెబుతున్నారు. సాధారణంగా సెకండ్ షోలు తొమ్మిది న్నరకే మొదలైపోతాయి. ఆలెక్కన... ఇది అఫీషియల్ టైమే. ఈ రూల్ ని అడ్డం పెట్టుకొని తొమ్మిదిన్నరకు పర్మిషన్లు తెచ్చుకొన్నారని వినికిడి. మొత్తానికి బాహుబలి ప్రీమియర్ల వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు మాత్రం జోరుగా పుకార్లు రేగుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



