ఈ నెల బెస్ట్ ఫిల్మ్ గా 'బహుబలి 2'
on Aug 26, 2015
ఇండియాలో ఎక్కడ చూసిన షార్ట్ ఫిల్మ్స్ ట్రెండే నడుస్తోంది. సినిమాలు తీయటానికి కుదరని వాళ్ళు,ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తమ లోని టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఓ వ్యక్తి సినిమా డైరక్టర్ అవ్వాలంటే అసెస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించనవసరం లేదని, ఓ కథ చెప్పాలన్న విపరీతమైన ఆసక్తి, ఆ కథపై స్పష్టత వుంటే చాలని తెలుగువన్ నమ్ముతోంది. దాని కోసం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి, ప్రతి నెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ భాష లో తీసిన షార్ట్ ఫిల్మ్ అయిన ఈ కాంటెస్ట్ లో పాల్గొనవొచ్చు.
ఈ నెలలో.. అంటే జూలై 16 నుంచి ఆగష్టు 15 వరకు ‘తెలుగువన్’ ఇచ్చే బెస్ట్ ప్రైజ్ కోసం ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ‘తెలుగువన్’ పరిశీలనకు వచ్చాయి. వీటిలో 'బాహుబలి 2' అనే షార్ట్ ఫిల్మ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన శ్రీకాంత్ రెడ్డి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.