తొలిరోజే భారీ కలక్షన్లు రాబట్టిన ' బాఘీ '..!
on Apr 30, 2016
రివ్యూలన్నీ ఏకిపారేస్తున్నా టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ నటించిన బాఘీ కలెక్షన్స్ మాత్రం గట్టిగానే వచ్చాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా 11.87 కోట్లు సాధించింది. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో తొలిరోజు కలెక్షన్లలో షారుఖ్ ఫ్యాన్ (19.20 కోట్లు), ఎయిర్ లిఫ్ట్ (12.35) కోట్లు సాధిస్తే, వాటి తర్వాతి స్థానంలో బాఘీ నిలిచింది. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ తో ఈ కలెక్షన్లు సాధించడం విచిత్రం. షబ్బీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన బాఘీ వర్షం రీమేక్ గా రూపొందింది. సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. దేశవ్యాప్తంగా దాదాపు 2750 స్క్రీన్లలో ఈ సినిమా విడులవ్వడం విశేషం. తెలుగు హీరో సుధీర్ బాబు, ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా, సుధీర్ బాబు కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత సుధీర్ మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.