ENGLISH | TELUGU  

అచ్చ తెలుగు అవకాయ 'అవసరాల"

on Sep 8, 2016

ఆ సినిమాలో పెద్ద నటులు లేరు..అదిరిపోయే గ్రాఫిక్స్ హంగులు లేవు..కాని టాలీవుడ్ ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కారణం తెలుగుదనం. ఆ మూవీనే విడుదలకు సిద్ధంగా ఉన్న "జోఅచ్యుతానంద". బ్లాక్‌బస్టర్లు ఇచ్చే దర్శకులు ప్రతి తరంలోనూ ఉంటారు...పెద్ద హీరోలతో పెద్ద  పెద్ద హిట్లిచ్చేవాళ్లూ ఉంటారు..కానీ మాస్ మసాలా సినిమాల జోలికి వెళ్లకుండా తెలుగు తనం ఉట్టిపడే సినిమాలు తీసే దర్శకులు తరానికి ఏ ఒక్కరో ఉంటారు. అలాంటి వారిలో కె.విశ్వనాథ్, బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి పేర్లు చెప్పుకోవచ్చు. మరి ఈ తరంలో తనదైన శైలిలో తెలుగుదనం నిండిన సినిమాతో ఆడియాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోన్న యంగ్ డైరెక్టర్ ఎవరునుకుంటున్నారు. తెలుగువారి తెలుగుదనం అవసరాల్ని తీరుస్తోన్న ఆ దర్శకుడు అవసరాల శ్రీనివాస్.

అష్టాచెమ్మా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వినోదాన్ని పంచుతున్నాడు. ఓ వైపు నటుడిగా కొనసాగుతూనే మరోపక్క తనలోని దర్శకుడిని పరిచయం చేశాడు అవసరాల. ఊహలు గుసగుసలాడే అనే ఆహ్లాదకరమైన టైటిల్‌తో అతను తీసిన మొదటి సినిమా టైటిల్‌కు తగ్గట్టే హాయిగా సాగిపోతుంది. సాగర తీరంలో సంధ్యా సమీరంలా అనిపించేలా తెరకెక్కించిన ఈ సినిమా మూవీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. పాటలు, సన్నివేశాలు అన్నీ మనల్ని ఊహా లోకంలో విహరింపచేస్తాయి. శ్రీనివాస్‌లోనూ ఒక మంచి దర్శకుడున్నాడని..ఇలాంటి వాళ్లు తెలుగు సినిమాకి ఎంతో అవసరం అన్నంతగా అలరించాడు అవసరాల.

అనంతరం చాలా గ్యాప్ తీసుకున్న శ్రీని... జోఅచ్యుతానంద అనే మరో అచ్చ తెలుగు టైటిల్‌తో ఇప్పుడు మరో సినిమా తీశాడు. దీనిని ఎప్పుడెప్పుడు చుద్దామా అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. అసలు ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేంతగా శ్రీనివాస్ చేసిన మాయాజాలం ఏంటి..అంటే నిత్యం, అనునిత్యం టైటిల్ కార్డ్ దగ్గర నుంచి పాటల వరకు ఇంగ్లీష్ మయమే. ఒక్క ఆంగ్లపదమూ లేని తెలుగు సినిమా లేదా.?? రాదా?? అనుకుంటున్న సమయంలో అవసరాల అమ్మ భాషనే నమ్మకున్నాడు.

కలర్‌ఫుల్ పిక్చరైజేషన్‌తో పాటు మాతృభాషలోనే సంభాషణలు రాయించాడు. హీరోయిన్లను అందంగా చూపించడానికి ఆధునికత వైపు మొగ్గు చూపకుండా పదహారణాల చీరకట్టులోనే తీర్చిదిద్దాడు. అవసరాల సినిమా చూసిన సగటు తెలుగు ప్రేక్షకులు ఆ పాత్రల్లో తమను తాము చూసుకుంటున్నారు. తాము మిస్సైయ్యింది.. మిస్సవుతొంది ఏంటో తెలుసుకున్న అభిమానులు ఆ సహజత్వానికి ఆకర్షితులై సినిమాలో లీనమైపోయారు. ఇప్పుడు ఆ మాయే శ్రీని సినిమా కోసం జనం ఎదురుచూసేలా చేసింది. అందుకే జోఅచ్యుతానంద టాలీవుడ్‌లో మోస్ట్ ఏ వెయిటేడ్ మూవీగా మారిపోయింది. ఈ సినిమాలో అవసరాల ఏం మాయ చేశాడా అని వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.