అనుష్క కీ అదే షాక్ తగులుతుందా?
on Aug 25, 2015
ఇది వరకు కథానాయకుల పారితోషికంతో నిర్మాతలకు చుక్కలు కనిపించేవి. ఇప్పుడు హీరోయిన్లు కూడా వాళ్లతో పోటీకొస్తున్నారు. టాప్ పొజీషన్ దక్కితే చాలు.. 'కో.. కో.. కోటి' అంటూ కోడై కూస్తున్నారు. స్టార్ కథానాయిక కావాలంటే ఆ మాత్రం ఇచ్చుకోక తప్పడం లేదు. ఇప్పుడు.. కథానాయికలూ తెలివి మీరారు. 'హీరోల్లానే మాకూ లాభాల్లో వాటా కావాల'ని డిమాండ్ చేస్తున్నారు.
మొన్నటికి మొన్న 'జ్యోతిలక్ష్మి' కోసం ఛార్మి పారితోషికం తీసుకోకుండా వాటా అడిగింది. చివరికి ఆమెకు రిక్త హస్తాలే మిగిలాయ్ అనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు అనుష్క కూడా అదే పాట పాడుతోందట. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న చిత్రం సైజ్ జీరో. సినిమా అంతా అనుష్క చుట్టూనే తిరుగుతుంది. కాల్షీట్లు కూడా భారీగానే కేటాయించింది. మామూలుగా అయితే.. ఈ సినిమాకి రెండు కోట్ల వరకూ పారితోషికం అందుకోవచ్చు. కానీ అనుష్క మాత్రం పారితోషికం వద్దు.. లాభాల్లో వాటా కావాలందట.
ఎందుకంటే పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, తమిళం రెండు వైపుల నుంచీ మార్కెట్ ఉండేలా చూసుకొన్నారు. కనీసం రెండు చోట్లా రూ.30 కోట్లు వచ్చినా.. అనుష్కకి బాగానే గిట్టుబాటు అవుతుంది. కనీసం రూ.4 కోట్లయినా రాబట్టుకోవచ్చు. అందుకే... అనుష్క 'వాటా' వైపే మొగ్గుచూపిందట. సినిమా వర్కవుట్ అయితే పర్వాలేదు.. అనుకొన్న సొమ్ము వస్తుంది. వర్ణలా వాషవుట్ అయితే మాత్రం.. ఛార్మికి పట్టిన గతే పడుతుంది. ఆ విషయం తెలీయట్లేదు అమ్మడికి.