కల్పిక పై మరో పోలీసు కేసు.. కీర్తన ఎవరో మీకు తెలుసా!
on Jun 14, 2025

ప్రముఖ సినీ నటి కల్పిక(Kalpika)గత నెల 29న హైదరాబాద్(Hyderabad)లోని 'ప్రిజం పబ్'(Prisam Pab)కి వెళ్ళింది. డబ్బులు పే చేయకుండా, సిబ్బంది పై ప్లేట్స్ విసిరేయడం, బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టడం లాంటివి చేసి, అమర్యాదకంగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు కోర్టు అనుమతితో కల్పిక పై సెక్షన్ 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చెయ్యడం జరిగింది.
రీసెంట్ గా కీర్తన అనే అమ్మాయి కల్పిక పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో 'కల్పిక ఇనిస్టా(Instagram)వేదికగా అసభ్య పదజాలంతో తనని దూషిస్తుందని పేర్కొనడమే కాకుండా, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలని కీర్తన పోలీసులకి అందించింది. దీంతో కల్పిక పై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



