రామ్ చరణ్ చిత్రానికి అనిరుధ్ బాణీలు!
on Dec 26, 2021

తమిళనాట అగ్ర సంగీత దర్శకుడిగా రాణిస్తున్న అనిరుధ్.. తెలుగులో `అజ్ఞాతవాసి`, `జెర్సీ`, `గ్యాంగ్ లీడర్` వంటి సినిమాలకు స్వరాలు సమకూర్చాడు. వీటిలో టాలెంటెడ్ కెప్టెన్ గౌతమ్ తిన్ననూరి రూపొందించిన `జెర్సీ` చిత్రం అనిరుధ్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడదే స్పోర్ట్స్ డ్రామా అదే పేరుతో హిందీలో రీమేక్ కాగా, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు అనిరుధ్. మరో ఐదు రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. `జెర్సీ` రెండు వెర్షన్స్ రూపంలో గౌతమ్ తిన్ననూరి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి సంగీతమందించిన అనిరుధ్.. గౌతమ్ డైరెక్ట్ చేయనున్న తదుపరి సినిమాకి కూడా బాణీలు అందించనున్నాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకి అనిరుధ్ బాణీలు అందిస్తాడని ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే.. చరణ్ చిత్రానికి అనిరుధ్ ట్యూన్స్ కట్టడం ఇదే మొదటి సారి అవుతుంది. త్వరలోనే చరణ్ - గౌతమ్ కాంబో మూవీలో అనిరుధ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
మరి.. బాబాయ్ పవన్ `అజ్ఞాతవాసి`కి అచ్చిరాని అనిరుధ్ ఫ్యాక్టర్.. అబ్బాయ్ చరణ్ కి కలిసొస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



