పిల్ల బచ్చాలు మా సినిమాకి రావద్దు..ఎందుకంటే A సర్టిఫికెట్
on Feb 23, 2024
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ లో ముగ్గరు అమ్మాయిలో ఒకరిగా చేసిన భామ అనన్య నాగళ్ల. ఆ మూవీలో దివ్య నాయక్ అనే పాత్రలో నటించి మంచి పేరే సంపాదించింది. మల్లేశం, మాస్ట్రో, శాకుంతలం, ఊర్వశివో రాక్షసివో లాంటి సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఒక హర్రర్ మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ని పోషిస్తుంది. కాకపోతే మా సినిమాకి వీళ్ళు మాత్రం రావద్దని అంటుంది. ఎవర్ని రావద్దంటుందో చూద్దాం
అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి లు జోడీగా నటిస్తున్న తాజా చిత్రం తంత్ర. అదోక హర్రర్ మూవీ అని ఆ పేరు చూస్తేనే అర్ధం అవుతుంది.ఇప్పుడు ఈ మూవీకి సెన్సార్ వాళ్ళ నుంచి A సర్టిఫికేట్ రావడం జరిగింది. దీంతో తంత్ర టీమ్ ఒక డిఫరెంట్ యాంగిల్ లో రియాక్ట్ అయ్యింది. ఎలాగు A సర్టిఫికెట్ వచ్చింది కదా అని అనుకున్నారో ఏమో మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని టీం చెప్తుంది. పైగా A ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసి మరి చెప్తున్నారు.
ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన వాళ్ళందరు నెగిటివ్ ని కూడా మేకర్స్ భలే పాజిటివ్ గా మార్చుకున్నారని అంటున్నారు. కొంత మంది అయితే ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. తంత్ర నుండి ఇప్పటికే రిలీజైన్ టీజర్ అండ్ సాంగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. క్షుద్రపూజలకి గురైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనన్య చేస్తుంది. అదే టైంలో ధీరే ధీరే సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా హావభావాలని పలికించి కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది.