హైరానాలో హనీమూన్ కూడా జరుపుకోలేదట!
on Jul 28, 2016
ఏ అబ్బాయి/అమ్మాయికైనా పెళ్లి అనేది ఎంతటి సుందర స్వప్నమో.. పైకి చెప్పుకోరు కానీ పెళ్ళి తర్వాత తమ భార్య/భర్తతో కలిసి వెళ్ళే "హనీమూన్" అంటే అంతకుమించిన మధుర స్వప్నం. పెళ్ళి ఫిక్సయిన నెక్స్ట్ మినిట్ నుంచి తమ బడ్జెట్ పరిమితుల మేరకు హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం అని రకరకాల ప్లానింగులు చేసుకుంటూ ఉంటారు. ఇక సినీతారాల గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది.. వాళ్ళ హనీమూన్లన్నీ విదేశాల్ళోనే జరుగుతుంటాయి.
కానీ.. మన మహేష్ బాబు హీరోయిన్ మరియు బాలీవుడ్ బ్యూటీ అయిన అమృతా రావు పెళ్ళై మూడు నెలలూ పూర్తి కావస్తున్నా ఇప్పటికీ "హనీమూన్"కు వెళ్లలేదట. ఈ విషయాన్ని అమృతారావు స్వయంగా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పి.. మళ్ళీ తాను సీరియల్స్ లో బిజీగా ఉండడం వల్ల ఖాళీ దొరకక్పోవడంతో వెళ్లలేకపోయానని త్వరలోనే మాంచి ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నాని చెప్పింది!