ఘనంగా 'అమరావతికి ఆహ్వానం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
on Feb 8, 2026

శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా "అమరావతికి ఆహ్వానం" (Amaravathiki Aahwanam). ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మించారు.
"అమరావతికి ఆహ్వానం" సినిమా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ నటులు, నిర్మాత మురళి మోహన్‌గారు, యంగ్ హీరో అశ్విన్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో...
ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. "తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మనం ఆస్కార్ రేంజ్ సినిమాలు చేస్తున్నాం. అయితే అలాంటి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా పరిశ్రమకు అవసరం. అలా రెగ్యులర్ గా చిన్న మూవీస్ నిర్మిస్తూ పరిశ్రమలో అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు మా మిత్రులు శివ కంఠంనేని, వెంకటేశ్వరరావు... వారు నిర్మించిన "అమరావతికి ఆహ్వానం" సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా." అన్నారు.
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ తోనే సినిమా చూడాలనే ఆసక్తిని డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు. ముగ్గురు హీరోయిన్స్ తో ఇలాంటి మూవీ చేయడం సులువైన పని కాదు. మేము రాజు గారి గది సినిమా చేసినప్పుడు ఇలాంటి చిన్న బడ్జెట్ తోనే చేశాం. ఆ మూవీని మీరంతా ఆదరించారు. ఈ చిత్రానికి కూడా అలాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముగ్గురు హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత, హీరో శివ గారికి ఆల్ ది బెస్ట్." అన్నారు.
నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "ఇవాళ అమరావతికి ఎంతో ఖ్యాతి వస్తోంది. అలాంటి నగరం పేరుతో మేము హారర్ మూవీ చేశాం. మా హీరోయిన్స్ తమ అందంతో పాటు నటనతో మీ అందరినీ ఆకట్టుకుంటారు. మాకు ఈ చిత్రంతో సక్సెస్ దక్కుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూశాక మరింత పెద్ద హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. మా డైరెక్టర్ జీవీకే గారు మరిన్ని మూవీస్ చేయాలి. మా హీరో శివ గారికి ఇతర టీమ్ అందరికీ గుడ్ లక్ చెబుతున్నా." అన్నారు.
డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం అనే టైటిల్ చూసి ఇదోదే పొలిటికల్ మూవీ అనుకుంటున్నారు. కాదు ఇందులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. రెండున్నర గంటలు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎవరు చెప్పే వ్యూస్ నమ్మకండి. మా హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే శివ గారి డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయాను. మా ప్రొడ్యూసర్స్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మా మూవీ ట్రైలర్ నచ్చితే వచ్చి థియేటర్స్ లో చూడండి." అన్నారు.

హీరో శివకంఠంనేని మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం సినిమా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకున్నాం. ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నాం. ఎంటర్ టైన్ మెంట్ కు మేము గ్యారెంటీ ఇస్తున్నాం. రెండున్నర గంటలు మూవీని ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్లంతా డెడికేటెడ్ గా ఈ సినిమాకు వర్క్ చేశారు. టెక్నికల్ గా మా మూవీ చాలా క్వాలిటీగా ఉంటుంది. చిన్న చిత్రాలకు ప్రేక్షకులు రావాలి. అప్పుడే మరిన్ని మూవీస్ చేయగలుగుతాం. ఏడాదికి దాదాపు 300 చిన్న చిత్రాలు తెరకెక్కుతాయి. వాటితోనే ఇండస్ట్రీ రన్ అవుతుంటుంది." అన్నారు.
హీరోయిన్ సుప్రిత మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నేను బయట ఎంత అల్లరిగా, సరదాగా ఉంటానో ఈ సినిమాలోనూ అలాంటి క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రకు నేను బాగా రిలేట్ అయ్యాను. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు ధన్య, ఎస్తేర్ గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. శివ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది." అన్నారు.
హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ "మంచి కథతో చేసిన చిత్రమిది. నేను కూడా మీతో పాటు ఈ నెల 13న థియేటర్స్ లో సినిమా చూడబోతున్నా. మా అందరికీ ఎగ్జైటింగ్ గా ఉంది. మూవీ తప్పకుండా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాం. నేను బాగా నటించగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ థ్యాంక్స్. అమరావతికి ఆహ్వానం సినిమాను మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా." అన్నారు.
హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ "మీ కళ్లు బాగుంటాయి, రొమాంటిక్ మూవీస్ చేయండి, ట్రెడిషనల్ ఫ్యామిలీ మూవీస్ చేయండి అని అంటుంటారు కానీ మా డైరెక్టర్ జీవీకే మీ కళ్లు బాగుంటాయి మీరు హారర్ మూవీ చేయాలని వచ్చారు. నేను రాజా రాణి మూవీ చేసినప్పుడు అట్లీ గారు ఎంత టాలెంటెడ్ గా అనిపించారో ఈ సినిమా చేశాక జీవీకే గారిపై అలాంటి అభిప్రాయమే కలిగింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నాం. వాళ్లకు కావాల్సినంత స్పేస్ ఇవ్వండని శివ గారు చెప్పడం ఆయనకు మూవీ మీద ఉన్న ప్యాషన్ ను తెలియజేస్తుంది. అమరావతికి ఆహ్వానం సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరంతా థియేటర్స్ కు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి." అన్నారు.
డీఓపీ జె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ "అమరావతికి ఆహ్వానం అంటే ఇది ఏపీలోని అమరావతి అనుకుంటున్నారు. కాదు ఇది నలుగురు ఏంజిల్స్ ఉండే అమరావతి. వాళ్లు తమ అందంతో ఆకట్టుకుంటారు, అలాగే డెవిల్స్ గా భయపెడతారు" అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్ మాట్లాడుతూ "మా మూవీలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. ఈ సాంగ్ మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. బీజీఎం కూడా నాకు మంచి పేరు తెస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ జీవీకే గారికి, ప్రొడ్యూసర్ వెంకటేశ్వరావు గారికి థ్యాంక్స్." అన్నారు.
నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ "ఆదిపర్వం సినిమాలో శివ గారితో కలిసి వర్క్ చేశాను. ఈ సినిమాలో ఒక పిచ్చివాడి క్యారెక్టర్ కు నేనే కావాలని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మనం రెగ్యులర్ క్యారెక్టర్స్ ఎన్నో చేస్తుంటాం కానీ ఈ క్యారెక్టర్ లో నటించడం డిఫరెంట్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది." అన్నారు.
నటుడు రఘుబాబు మాట్లాడుతూ "నాకు ప్రొడ్యూసర్స్ శివ కంఠంనేని, వెంకటేశ్వరరావు మంచి మిత్రులు. వారు నిర్మించిన చిత్రాల్లో నటించాను. ఈ సినిమాను దర్శకుడు జీవీకే బాగా తెరకెక్కించాడని నిర్మాతలు చెప్పారు. ఆది తర్వాత వినాయక్ గారికి ఎంత పేరొచ్చిందో ఈ సినిమా తర్వాత డైరెక్టర్ జీవీకేకు అంత గుర్తింపు దక్కాలి. ఈ సినిమాలో ముగ్గురు అందమైన ప్రతిభ గల హీరోయిన్స్ నటించారు. వారితో పాటు శివ గారికి ఇతర టీమ్ కు "అమరావతికి ఆహ్వానం" విజయాన్ని ఇవ్వాలి." అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



