డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పందించిన అల్లు అర్జున్
on Aug 20, 2014
.jpg)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు నిరాకరించి, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా చూపిస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం జరగడంపై అల్లుఅర్జున్ స్పందించారు. ఆ రాత్రి పోలీసులు నా కారును ఆపినప్పుడు ఏం జరిగిందంటే.. పోలీసులు నాకు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేస్తానన్నారు. అయితే కెమెరాలన్నీ నా మీద ఫోకస్ చేసి ఉండటంతో నాకు కాస్త అసౌకర్యంగా ఉందని వారికి చెప్పాను. కెమెరాలను అక్కణ్ణించి తప్పించాక, నేను పరీక్ష చేయించుకున్నాను. బ్రీత్ అనలైజర్ పరీక్ష తర్వాత మద్యం తీసుకోలేదని నిర్ధారించుకున్న పోలీసులు తనను పంపించారని వెల్లడించాడు. అయితే అల్లు అర్జున్ ‘ఐ యామ్ దట్ చేంజ్’ అనే షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించి ప్రశంసలు అందుకున్న కొద్ది రోజులకే ఈ వీడియో బయటకు రావడం గమనించాల్సిన విషయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



