అల్లు అర్జునే కాదు.. నేను కూడా తగ్గనంటున్న అల్లరి నరేష్!
on Jun 30, 2024
'తగ్గేదేలే' అంటూ 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) ఎంతటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లరి నరేష్ (Allari Naresh) కూడా 'తగ్గేదేలే' అంటున్నాడు. మరో పుష్పరాజ్ లా అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
అల్లరి నరేష్ హీరోగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బచ్చల మల్లి' (Bachhala Malli). హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి.. నరేష్ పుట్టినరోజు(జూన్ 30) సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో నరేష్ ఊరమాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. నరేష్ లుక్ పుష్పరాజ్ లుక్ ని తలపించింది. అంతేకాదు, "ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి" అనే డైలాగ్ తో అదరగొట్టాడు.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న 'బచ్చల మల్లి' సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)