అక్కడ అమ్మాయిఇక్కడ అబ్బాయి ఫస్ట్ డే కలెక్షన్స్!
on Apr 12, 2025
ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju),దీపికా పిల్లి(Deepika Pilli)హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'అక్కడ అమ్మాయిఇక్కడ అబ్బాయి నిన్న ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వెన్నెలకిషోర్,మురళీధర్ గౌడ్,జాన్ విజయ్,సత్య కీలక పాత్రల్లో కనపడగా 'మాంక్స్ అండ్ మంకీస్' నిర్మాణ సారథ్యంలో నితిన్,భరత్(Nithin Barath)ద్వయం దర్శకత్వం వహించారు.ఇప్పుడు ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయపదాన దూసుకుపోతుంది.
ఈ మూవీ తొలి రోజు 15 లక్షల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి.కాకపోతే మేకర్స్ నుంచి అధికార ప్రకటన మాత్రం రాలేదు.మూవీకి పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.ఇక చిత్ర బృందం రీసెంట్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది.అందులో ప్రదీప్ మాట్లాడుతు తమ సినిమాని ప్రమోట్ చేసిన మహేష్ బాబు,రామ్ చరణ్ కి ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా,మూవీ ఆధ్యంతం ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని రిలీజ్ కి ముందే ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నామని చెప్పడం జరిగింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
