అఖిల్ సినిమాకు చైతూ దర్శకుడు నిర్మాత!
on May 25, 2019

గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో అక్కినేని వారసుడు అఖిల్ సినిమా ప్రారంభమైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో మెగా మనిషి బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా తెరక్కుతోంది. నాగచైతన్యతో '100% లవ్' తరవాత అక్కినేని హీరోతో గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు మరో విశేషం ఉంది. ఇటు ప్రేక్షకులు... అటు తెలుగు సినిమా ప్రముఖులు... గీతా ఆర్ట్స్‌లో అక్కినేని హీరో సినిమాగా మాత్రమే దీన్ని చూస్తున్నారు. ఈ సినిమాకు మరో నిర్మాత వాసు వర్మ ఉన్నారనే సంగతి పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఈయన 'బొమ్మరిల్లు'తో పాటు భాస్కర్ దర్శకత్వం వహించిన 'పరుగు'కు స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. అక్కినేని నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్'తో దర్శకుడిగా మారారు. అదీ సంగతి. ఒకప్పటి చైతూ దర్శకుడు, ఇప్పుడు అఖిల్ సినిమాకు నిర్మాత అన్నమాట. 'జోష్' తరవాత సునీల్ హీరోగా 'కృష్ణాష్టమి'కి దర్శకత్వం వహించారు వాసు వర్మ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



