తమిళ అగ్ర హీరోకి ఏం కాలేదు..హాస్పిటల్ నుంచి వెళ్ళాడు
on Mar 9, 2024
తమిళ అగ్ర హీరోల్లో ఒకరు అజిత్. కొన్ని లక్షల మంది అభిమానులు ఆయన సొంతం.ఆయన ఏది చెప్తే అది చెయ్యడానికి రెడీ గా కూడా ఉంటారు. అసలు ఆయన సినిమా వచ్చిందంటే చాలు తమిళనాడు మొత్తం పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.అంతటి క్రేజ్ ని సంపాదించిన అజిత్ ఆరోగ్యం విషయంలో రెండు రోజుల నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి.దీంతో మా అభిమాన హీరోకి ఏమైంది? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అసలు ఆయన హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు? అనే టెన్షన్ లో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.
అజిత్ ప్రస్తుతం విడా ముయార్చి అనే మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే అజిత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం అన్ని మీడియా ఛానెల్స్ లో ప్రసారమవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తాజాగా ఆయన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.చిన్న అలసట వలన ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని అలాగే ఆయన రెగ్యులర్ గా చేయించుకునే కార్డియక్, న్యూరో చెకప్‌లు కూడా చేయించున్నారని అంటున్నారు.ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పారు.
రెండున్నర దశాబ్దాల పై నుంచే అజిత్ తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతు వస్తుంది.ప్రేమలేఖ, వాలి. ప్రియురాలు పిలిచింది లాంటి సినిమాలు సృష్టించిన సంచలనాన్ని ఎవరు అంత త్వరగా మర్చిపోలే రు..లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా అన్ని జోనర్స్ లోను అధ్బుతంగా చేస్తాడు. అలాగే ఆయన మంచి కార్ రేసర్ కూడా. 100 ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన జాబితాలో మూడు సార్లు స్థానం కూడా దక్కించుకున్నాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చాలా సందర్భాల్లో నా సినీ రాజకీయ వారసుడు అజిత్ అని కూడా చెప్పింది.
Also Read