రజినీకాంత్ బయోగ్రఫీ మూవీకి గ్రీన్ సిగ్నల్.. హీరో ఇతనే
on Jan 28, 2026
.webp)
-సంబరాల్లో రజినీ ఫ్యాన్స్
-బయోగ్రఫీ పనులు స్టార్ట్ అయ్యాయి
-ఐశ్వర్య ఏం చెప్పింది
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కట్ అవుట్ కి ఉన్న చరిష్మా గురించి చెప్పడం ప్రారంభిస్తే ఆ చరిత్ర మాకు తెలుసులే మిగతా విషయం చెప్పమనే పరిస్థితి. అంత విప్లవ నాదంలా రజినీకాంత్ అభిమానులు, ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరి ఉన్నాడు. ప్రస్తుతం తన స్నేహితుడు, సహా నటుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)నిర్మాణ సారధ్యంలో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీంతో సదరు ప్రాజెక్ట్ ఇండియన్ చిత్ర సీమలోనే క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. అలాంటి ఈ టైంలో రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య మరో క్రేజీ న్యూస్ చెప్పింది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య(Aishwarya Rajinikanth)మాట్లాడుతు మా నాన్న ఆటో బయోపిక్ కి సంబంధించిన వర్క్ ని ఇప్పటికే ప్రారంభించాను. సదరు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక సన్సేషన్ అవుతుందని తెలిపింది. నిజానికి రజినీకాంత్ బయోపిక్ తెరకెక్కబోతుందనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతుంది. అభిమానులు కూడా ఎంతో ఆశతో అధికార ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో స్వయంగా ఐశ్వర్య నే బయోపిక్ పై అధికారంగా చెప్పడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
Also read: సీతారామం పార్ట్ 2 కి ఆ హీరో, హీరోయిన్ మీకు ఓకేనా!.. వైరల్ గా మారిన పిక్
ఇక సదరు బయోపిక్ లో రజినీకాంత్ చేయడం అనేది పక్కా. వేరే వాళ్ళు చేస్తే అభిమానులు ఏం చేస్తారో తెలిసిందే. ఈ క్రమంలో బస్ కండెక్టర్ గా రజిని ని ఏఐ లో చూపిస్తారేమో అనే కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా కొంత మంది చేస్తున్నారు. కానీ అదే ఇంటర్వ్యూ లో ఐశ్వర్య మాట్లాడుతు ఏఐ వినియోగం మంచి పరిణామమే అయినా అది ఎప్పటికైనా కృత్రిమమే అనే విషయాన్నీ గుర్తించుకోవాలని చెప్పడం గమనార్హం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



