ఆసుపత్రిలో ఐశ్వర్య తండ్రి..పరిస్థితి విషమం
on Mar 10, 2017

బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు వారాల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్ధితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణరాజ్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో ఒకసారి చికిత్స తీసుకున్నప్పటికి క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు.
దీంతో రెండు వారాల క్రితం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. నిన్న మొన్నటి వరకు కృష్ణరాజ్ కోలుకుంటున్నట్టు కనిపించినప్పటికి రాత్రి నుంచి ఆయన పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. దీంతో దుబాయ్ పర్యటనలో ఉన్న ఐష్, న్యూయార్క్‌లో ఉన్న అభిషేక్ హుటాహుటిన ముంబై చేరుకున్నారు. ఐసీయూలో ఉన్న తండ్రిని చూసి ఐష్ బోరున విలపించారు..వైద్యులను అడిగి పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణరాజ్ అంటే ఐశ్వర్యకు పంచప్రాణాలు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తన తండ్రి పాత్ర మరువలేనిదని ఐష్ ఎన్నోసార్లు చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



