‘అజ్ఙాతవాసి’ని కాటేసిన కేసీయార్!
on Jan 9, 2018

ఇంకాసేపట్లో ‘అజ్ఙాతవాసి’ తెరపైకి రానున్నాడు. వపర్ స్టార్ సినిమా అంటే.. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోల... ఈ హడావిడి అలా ఇలా ఉండదు. అభిమానులు ఇప్పటికే మాం...చి ఆకలి మీదున్నారు. వారం ముందే అన్ని థియేటర్లలో టికెట్లు బుక్ అయిపోయాయ్. దొరకని వారు.. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే కసితో సాహసాలు చేసే పనిలో ఉన్నారు. వాతావరణం ఇంత హాట్ హాట్ గా ఉన్న ఈ టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం ‘అజ్ఙాతవాసి’పై పెద్ద వేటే వేసింది.
తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉన్నందున ‘అజ్ఙాతవాసి’ ప్రీమియర్ షోలను రద్దు చేస్తూ... ఉత్తర్యూలు విడుదల చేశారు. ఈ వార్త నిజంగా పవర్ స్టార్ అభిమానులకు చేదు వార్తే. అర్ధరాత్రి నుంచి ఆటలు వేస్తూ పోతే... శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనేది పోలీసుల వాదన. ఏది ఏమైనా... పవర్ స్టార్ ‘అజ్ఙాతవాసి’కి ప్రీమియర్ షోలు లేవు. రేపు మామూలుగా సినిమా చూస్కోవడమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



