నిఖిల్ ఎవరో కాదు బాహుబలి లో చిన్నప్పటి ప్రభాస్.. ఆదిత్య హాసన్ దర్శకుడు
on Apr 17, 2024
ఒక మూవీ థియేటర్స్ ల్లో రిలీజ్ అయ్యింది.బాగుందని టాక్ వస్తే ప్రేక్షకాదరణని పొందుతుంది.ఇదే సూత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లకి వర్తిస్తుంది. బాగుందని టాక్ వస్తే చాలు క్యాస్ట్ తో సంబంధంలేకుండా బ్రహ్మ రధం పడతారు అలా ఇటీవల ఓటిటి లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మెప్పు పొందిందే 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఇప్పడూ ఆ మూవీ డైరెక్టర్ కి ఒక సరికొత్త హీరో తోడయ్యాడు.
90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఈటీవీ విన్ లో ప్రసారం అయ్యింది. ఆదిత్య హాసన్(aditya haasan) రచన దర్శకత్వ బాధ్యతల్ని అందించాడు.పైగా ఆ సిరీస్ చాలా మందిని వెనుకటి కాలానికి తీసుకెళ్లి మంచి ఫీల్ ని అందించింది. ఆదిత్య కి కూడా ఎంతో పేరు వచ్చింది.దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో వస్తున్న ఒక వార్త అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రముఖ నటుడు నిఖిల్ దేవాదుల, ఆదిత్యల కాంబోలో ఒక నూతన వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. బాహుబలిలో ప్రభాస్ కి యంగ్ వెర్షన్ లో నిఖిల్ నటించాడు. అతని నటనకి మంచి మార్కులు పడ్డాయి ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఈ న్యూ వెడ్ సిరీస్ కి అజీమ్ మహమ్మద్ సంగీతాన్ని అందిస్తుండగా నవీన్ మేడారం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కి కూడా ఈయనే నిర్మాత. ఓటిటి పార్ట్నర్ సంబంధించిన వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. లేటెస్ట్ హిట్ మూవీ ప్రేమలు తెలుగు వెర్షన్ కి ఆదిత్య హాసన్ నే డైలాగ్స్ ని అందించాడు.
Also Read