ఆ హీరోతో డేటింగ్ చేయడం లేదంటోన్న అదా శర్మ
on Sep 21, 2020
నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో హీరోయిన్ అదా శర్మ గుర్తుంది కదా! ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో అల్లు అర్జున్తో ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్గా నటించింది. తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగని, హిందీలోనూ సూపర్ సక్సెస్లు సాధించలేదు. కానీ, సినిమాలు చేస్తోంది. హిందీలో ‘కమాండో’ ఫ్రాంఛైజీలో విద్యుత్ జమాల్ హీరో. అతడితో మూడు సినిమాలు చేయడంతో ఇద్దరూ రిలేషన్లో ఉన్నారని కొంతమంది కామెంట్లు చేశారు. అయితే, అటువంటిది ఏమీ లేదని అదా శర్మ అంటోంది.
విద్యుత్ జమాల్తో డేటింగ్ చేయడం లేదని అదా శర్మ క్లారిటీ ఇచ్చింది. అతడు ఎవరితో డేటింగ్లో ఉన్నాడో తనకు తెలుసనీ, అయితే ఆమె పేరు చెప్పలేనని ఆమె స్పష్టం చేసింది. ‘ఎటువంటి వ్యక్తులను డేట్ చేయరు?’ అన్న ప్రశ్నకు ‘పెళ్లైన వ్యక్తులతో డేటింగ్ చేయను’ అని అదా శర్మ సమాధానం చెప్పింది. మూగ జంతువుల చర్మాన్ని వలిచే వ్యక్తులనూ డేటింగ్ చేయనని ఆమె అన్నది.