ప్రముఖ నటి కస్తూరికి రిమాండ్...
on Nov 17, 2024
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిన్న హైదరాబాద్లో సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు ఈ నెల 29 వరకు ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. పుళల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని తరలించారు.
డీఎంకే నేతలను విమర్శించే క్రమంలో తెలుగు వారిని కించపరిచేలా కస్తూరి కామెంట్స్ చేసింది. దీనిపై తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి, తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. కస్తూరి తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేయగా, అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది. కస్తూరి అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Also Read