హీరోయిన్ ని కిడ్నాప్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు
on Feb 18, 2017

తెలుగు ఆడియన్స్ కి సుపరిచితురాలైన హీరోయిన్ భావనకి జీవితంలో మరచిపోలేని చేదు అనుభవం ఎదురయ్యింది. భావనని కొన్ని గంటల పాటు కిడ్నాప్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని వార్తలొస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం రాత్రి త్రిసూర్ నుండు కొచ్చికి తన కార్ లో వెళ్తున్న భావన ని నెడుంబసూర్ ఎయిర్పోర్టు దగ్గర కొందరు దుండగులు ఒక టెంపో ట్రావెలర్ లో వచ్చి తమ వాహనంతో ఢీ కొట్టడం జరిగింది. కొంత సమయం భావనకు దుండగులకు మధ్య గొడవ జరిగింది.
అకస్మాత్తుగా, డ్రైవర్ మార్టిన్ ని పక్కకి తోసేసి, ఆ దుండగులు భావనని ఆమె కార్ లోకి లాగి తీసుకెళ్లిపోయారు. కొన్ని గంటలు కార్ లోనే ఉంచి ఆమె తో అసభ్యం గా ప్రవర్తించారని తెలుస్తుంది. ఆమెతో ఫోటోలు, వీడియోలు తీసారని సమాచారం. చివరగా, ఆమెను పలరివట్టం జంక్షన్ లో వదిలేసి వెళ్లారు. తర్వాత, స్వంతగా కార్ నడుపుకుంటూ, దగ్గర్లో ఉన్న ఒక నిర్మాత ఇంటికి వెళ్ళిపోయింది భావన.
అయితే, ఈ ఉదంతం వెనుక భావన మాజీ కార్ డ్రైవర్ సునీల్ కుమార్ హస్తం ఉందని తెలుస్తుంది. టెంపో లో వచ్చిన దుండగుల్లో గతంలో నేర చరిత్ర ఉన్న సునీల్ కూడా ఉన్నాడని అంటున్నారు. భావన ఈ విషయమై పోలీస్ కేసు రిజిస్టర్ చేయగా, ప్రస్తుత డ్రైవర్ మార్టిన్ ని కస్టడీ లోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు, మార్టిన్ కి తెలిసే ఈ ఘటన జరిగిందని పోలీస్ లు అనుమానిస్తున్నారు.
అయితే, భావన మీద కిడ్నాప్ ప్లాన్ నిన్నటిది కాదని, రెండు నెలల క్రితం నుండి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



