ప్రధానిని కలిసిన మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్
on Jun 23, 2014

ఎన్నికల ముందు ఓట్ కాంపేన్ తో పాటు భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న అనేక సామాజిక అంశాలను తీసుకుని వినూత్నంగా రూపొందిచిన 'సత్యమేవ జయతే' కార్యక్రమం గురించి చర్చించడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలుసుకున్నారు. 'సత్యమేవ జయతే' కార్యక్రమానికి వ్యాఖ్యతగా అమీర్ ఖాన్ వ్యవహరించిన సంగతి విధితమే. ఈ కార్యక్రమంలో చూపించిన అంశాలను తప్పకుండా పరిశీలస్తామని ప్రధాని మోడి మాట ఇచ్చినట్లు అమీర్‌ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ప్రధాని తన విలువైన సమయాన్ని తన కోసం కేటాయించినందుకు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.
సౌత్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశాన్ని కర్టసీ కాల్ గా ప్రధాని కార్యాలయం ఉదహరించింది. ప్రధాని అధికారిక వెబ్‌సైట్ ఈ ఫోటోలను విడుదల చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



