ENGLISH | TELUGU  

అమీర్ ‘పీకే’ లో మరో మలుపు

on Jan 22, 2015

Aamir Khan PK Sued For Rs 1 Crore, Aamir Khan PK, Aamir Khan PK controversy

అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా దేశవ్యాప్తంగా ఇరగదీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చూసినవాళ్ళందరూ ఏం క్రియేటివిటీ.. ఏం క్రియేటివిటీ అని దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీని పొగుడుతున్నారు. అయితే ఆ క్రియేటివిటీ హిరానీది కాదు.. నాది.. నా కథని కాపీకొట్టి ఈ సినిమా తీశారంటూ ఓ రచయిత ఢిల్లీ హైకోర్టుకు ఎక్కాడు. తన కథ కాపీ కొట్టి ఈ సినిమా తీశారు కాబట్టి తనకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆ రచయిత అంటున్నా డు. కపిల్ ఇసాపురి అనే రచయిత తాను 2013లో రచించి ముద్రించిన ‘ఫరిస్తా’ అనే నవలని కాపీకొట్టి ‘పీకే’ సినిమా తీశారని ఆరోపించాడు. తన నవలలో థీమ్, అనేక సన్నివేశాలు ‘పీకే’ సినిమాలో కనిపిస్తాయి కావాలంటే పరిశీలించుకోండని అంటున్నాడు. తనకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వడంతోపాటు సినిమా టైటిల్స్‌లో తన పేరు కూడా జోడించాలని డిమాడ్ చేస్తున్నాడు. ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిశీలనలో వుంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.