ఏఆర్ రెహమాన్ విడాకులు.. అసలు కారణం ఏంటి?
on Nov 19, 2024
భారతీయ సంగీత ప్రపంచంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ శైలి చాలా విభిన్నమైనది. ఏ భాషలో అయినా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి సంగీతం అందిస్తుంది రెహమాన్ అని తెలిస్తే చాలు ప్రేక్షకులు, ఆ సినిమాకి పోటెత్తే వాళ్ళు. కృష్ణం రాజు హీరోగా వచ్చిన పల్నాటి పౌరుషం తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం మొన్న ధనుష్ హీరోగా వచ్చిన రాయన్ వరకు కొన్ని వందల పాటలకి ట్యూన్స్ ని అందించి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. ఆస్కార్ ని కూడా అందుకొని భారతీయ సినీ పరిశ్రమకి అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాడు. (AR Rahman Divorce)
రీసెంట్ గా ఆయన భార్య సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా, తన తరుపున్యాయవాది అధికారంగా వెల్లడి చేసింది. ఇరవై తొమ్మిది సంవత్సరాల తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకుంటున్నామని సైరా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కష్టకాలంలో తన పైవసీని గౌరవించాలని కూడా సైరా అందరకి విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.
ఇక ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రెహ్మాన్ ట్వీట్ చేస్తూ ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు. ఈ క్లిష్ట పరిస్థితులలో అండగా నిలుస్తున్న స్నేహితులకు, సన్నిహితులకు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.
Also Read