వీరాభిమానం..2916 ఫోటోలతో సమంత చిత్రం..!
on May 16, 2016
.jpg)
అభిమానులు తారలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అనడానికి మనకు ప్రతి నిత్యం ఎన్నో ఎగ్జాంపుల్స్ కనబడతూనే ఉన్నాయి. కొందరు తమ అభిమాన తారలకు గుడికడితే..కొందరు వారి ఫోటోలు లేదా పేర్లను ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సమంత అభిమానులు చేరిపోయారు. ఓ అభిమాని సమంతపై తనకున్న అభిమానాన్ని చూపించాలనుకున్నాడు. దీనిలో భాగంగా సమంత నటించిన పలు చిత్రాల్లోని సుమారు 2916 ఫోటోలను ఉపయోగించి ఆమె రూపం వచ్చేలా ఒక కొలేజ్‌ను తయారు చేసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. తనపై చూపిన అభిమానానికి జెస్సీ ఉబ్బితబ్బిబ్బయిపోయింది. వెంటనే ఆ అభిమాని ట్వీట్‌కు రీట్వీట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



