మణిశర్మ సంగీతప్రస్థానానికి 30 వసంతాలు!
on Feb 7, 2022

మెలోడీబ్రహ్మ మణిశర్మ.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. రెండు తరాల అగ్ర కథానాయకులందరికీ బాణీలు అందించడమే కాకుండా, దాదాపు అందరి కాంబినేషన్స్ లోనూ మంచి విజయాలు చూశారాయన. అంతేకాదు.. పలు ఇండస్ట్రీ హిట్స్ లో భాగమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్వరకర్తగా తనదైన ముద్ర వేశారు మణి. అలాంటి.. మణిశర్మ సంగీత దర్శకుడిగా తొలి అడుగేసి నేటికి 30 వసంతాలు.
Also Read: 'అల్లూరి సీతారామరాజు'పై బాలయ్య క్వశ్చన్.. తప్పులో కాలేసిన మహేశ్!
సరిగ్గా ఇదే ఫిబ్రవరి 7న 1992లో మణిశర్మ తొలిసారిగా నేపథ్య సంగీతమందించిన బైలింగ్వల్ మూవీ `రాత్` (తెలుగులో `రాత్రి`) విడుదలైంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రోత్సాహంతో ఈ సూపర్ నేచురల్ హారర్ ఫిల్మ్ కి నాణ్యతతో కూడిన నేపథ్య సంగీతమందించి తొలి అడుగులోనే తన ప్రత్యేకత చాటుకున్నారు మణి. ఆపై అదే వర్మ 1992లోనే తెరక్కించిన `అంతం` చిత్రం కోసం ``చలెక్కి ఉందనుకో`` అనే గీతానికి తొలిసారిగా ట్యూన్ కట్టారు. అయితే, 1998లో విడుదలైన `బావగారూ బాగున్నారా`, `చూడాలని వుంది!` చిత్రాలతోనే మణిశర్మ కెరీర్ ఊపందుకుంది. ఇప్పటికీ తన స్వరవిన్యాసాలతో మైమరిపిస్తూనే ఉన్నారు మణి. 30 వసంతాల సంగీత ప్రస్థానం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా.. మణి మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



