2025 సంక్రాంతి పోరు.. అంతకుమించి!
on Jan 16, 2024
ఈ సంక్రాంతి పోరు మాములుగా లేదు. 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలు పొంగల్ బరిలో దిగి అలరిస్తున్నాయి. అయితే వచ్చే సంక్రాంతి గురించి అప్పుడే చర్చ మొదలైంది. వచ్చే పొంగల్ పోరు అంతకుమించి అనేలా ఉండబోతుంది.
ఏడాది ముందుగానే 2025 సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే 'శతమానం భవతి' సీక్వెల్ ని కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా 'హనుమాన్' వచ్చింది. ఈ యూనివర్స్ లో భాగంగా రెండో సినిమా 'అధీర'ను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నామని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఇక నాగార్జున 'బంగార్రాజు' సీక్వెల్ కూడా 2025 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా సైతం వచ్చే పొంగల్ రేస్ లో నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
2017 సంక్రాంతికి చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'శతమానం భవతి' విడుదలయ్యాయి. ఈ మూడూ కూడా హిట్స్ గా నిలిచాయి. ఇక 2025 పొంగల్ బరిలో 'విశ్వంభర', 'శతమానం భవతి-2'తో పాటు బాలయ్య సినిమా కూడా నిలిస్తే.. 2017 వార్ రిపీట్ అవుతుంది. మరి రిజల్ట్ కూడా అదే రిపీట్ అవుతుందేమో చూడాలి.
Also Read