డీఎస్పీ.. గురుశిష్యుల స్పెషల్!
on Dec 13, 2021

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు తెలుగు చిత్రాలతో పలకరించాడు. జనవరిలో `అల్లుడు అదుర్స్`, ఫిబ్రవరిలో `ఉప్పెన`, మార్చిలో `రంగ్ దే`.. అంటూ వరుసగా మూడు నెలల పాటు సందడి చేసిన డీఎస్పీ ఈ డిసెంబర్ లో `పుష్ప`, `గుడ్ లక్ సఖి` చిత్రాలతో ఎంటర్టైన్ చేయనున్నాడు. వీటిలో `పుష్ప` డిసెంబర్ 17న రిలీజ్ కానుండగా.. `గుడ్ లక్ సఖి` డిసెంబర్ 31న థియేటర్స్ లోకి రానుంది.
నాకు టెన్షన్ గా ఉంది.. బన్నీ ఫోటో పట్టుకెళ్లండి!
ఇదిలా ఉంటే.. 2021 దేవిశ్రీకి ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే.. గురుశిష్యులైన దర్శకుల కాంబినేషన్ లో సినిమాలు చేసి వార్తల్లో నిలుస్తున్నాడు డీఎస్పీ. ఆ వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరిలో విడుదలై బాక్సాఫీస్ ముంగిట సంచలన విజయం సాధించిన `ఉప్పెన`తో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం కాగా.. ఇప్పుడు సుక్కు దర్శకత్వంలో రూపొందిన `పుష్ప` విడుదలకు సిద్ధమైంది. అలా.. గురుశిష్యులైన దర్శకులతో ఒకే క్యాలెండర్ ఇయర్ లో సినిమాలతో సందడి చేసినట్లయ్యింది దేవి శ్రీ ప్రసాద్ కి. మరి.. సుకుమార్ శిష్యుడి కాంబోలో ఘనవిజయం చూసిన డీఎస్పీ.. ఇదే ఏడాది సుక్కు కాంబోలోనూ మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



