Home

»

Latest News

మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఖ‌డ్గం`కి 19 ఏళ్ళు!

Nov 29, 2021 9:57AM

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన ద‌ర్శ‌కుల్లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ఒక‌రు. విభిన్న క‌థాంశాల‌తో ఆయ‌న రూపొందించిన ప‌లు సినిమాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. వాటిలో `ఖ‌డ్గం` ఒక‌టి. దేశ‌భ‌క్తి, స్నేహం, ప్రేమ‌, సినిమా, ఉగ్ర‌వాదం.. ఇలా అనేక అంశాల మేళ‌వింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారాయ‌న‌. శ్రీ‌కాంత్, ర‌వితేజ, ప్రకాశ్ రాజ్ క‌థానాయ‌కులుగా న‌టించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే, సంగీత‌, కిమ్ శ‌ర్మ‌, ఉత్తేజ్, ష‌ఫీ, ఆహుతి ప్ర‌సాద్, పృథ్వీ, బ్ర‌హ్మాజీ, పావ‌లా శ్యామ‌ల‌, సుబ్బ‌రాజు, ఎమ్మెస్ నారాయ‌ణ‌, ర‌ఘుబాబు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు. ఉత్తేజ్ అందించిన సంభాష‌ణ‌లు ఈ చిత్రానికి అద‌నపు బ‌లంగా నిలిచాయి.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించిన ఈ చిత్రంలో.. ``నువ్వు నువ్వు``, ``ఆహా అల్ల‌రి``, ``మేమే ఇండియ‌న్స్``, ``గోవిందా గోవిందా``, ``ముసుగు వేయొద్దు``, ``ఖ‌డ్గం ఖ‌డ్గం`` ఇలా అన్నీ పాట‌లు విశేషాద‌ర‌ణ పొందాయి.  ఐదు నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న ఈ సినిమా.. హిందీలో `ఇన్సాన్` పేరుతో రీమేక్ అయింది. కార్తికేయ క్రియేష‌న్స్ ప‌తాకంపై సుంక‌ర మ‌ధు ముర‌ళి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 న‌వంబ‌ర్ 29న విడుద‌లై మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన `ఖ‌డ్గం`.. నేటితో 19 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com