అల్లు అర్జున్,త్రివిక్రమ్ సినిమాపై ప్రముఖ నిర్మాత కామెంట్స్ వైరల్
on Dec 30, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)పుష్ప 2(pushpa 2)తో తన కట్ అవుట్ కి ఉన్న చరిష్మాని మరోసారి చాటి చెప్పాడు.వరల్డ్ వైడ్ గా 1500 కోట్లుని రాబట్టిన పుష్ప ఇప్పుడు బాహుబలి 2 రికార్డు మీద కన్నేసింది.మరికొన్ని రోజుల్లో ఆ రికార్డుని కూడా క్రాస్ చేసే అవకాశం ఉందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినబడుతుంది.ఇక అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర చినబాబు, నాగవంశీ లు అత్యంత భారీ వ్యయంతో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్(trivikram)చినబాబు(chinababu)కాంబోలో ఇప్పటికే జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి,అల వైకుంఠపురం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.దీంతో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించబోతున్నారు.ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం అల్లు ఫ్యాన్స్ రీగర్ గా ఎదురుచూస్తూ వస్తున్నారు.అలాంటి ఈ టైంలో నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ(naga vamsi)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.త్వరలోనే బన్నీ గారు త్రివిక్రమ్ తో కూర్చొని,తన క్యారక్టర్ తో పాటు గెటప్ విషయంలో చర్చలు జరుపుతారు. 2025 మిడిల్ లో షూట్ ని స్టార్ట్ చేసి 2026 ఎండింగ్ లో సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నామని చెప్పుకొచ్చాడు.
గీతా ఆర్ట్స్(geetha arts)కూడా ఈ భారీ ప్రాజెక్టు లో భాగస్వామ్యం కానుండగా తమన్(thaman)సంగీతాన్ని అందించబోతున్నాడు.రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా ఈ చిత్రం తెరకెక్కబోతుందనే టాక్ అయితే వినబడుతుంది.ఇతర నటినటులు,సాంకేతిక నిపుణుల వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.ఇక జనవరి 1 నుంచి పుష్ప 2 లో కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నారనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.ఇందుకు సంబంధించిన డబ్బింగ్ ని కూడా అల్లు అర్జున్ చెప్తున్నాడని అంటున్నారు.
Also Read