అగ్నిప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్..తీవ్ర గాయాలు
on Apr 7, 2025
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar)సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు,కాళ్ళకు గాయాలయ్యాయి.ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు.మార్క్ శంకర్ ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కల్యాణ్ కి విషయం తెలియడంతో పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు.అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు.దీంతో మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
