నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లన్, కథి దేవిసన్, సత్య, జాన్ విజయ్, తులసి, ఆనంద్, ఆడుకాలం నరేన్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు
రచన,దర్శకత్వం: విశ్వకరుణ్
సినిమాటోగ్రఫి: విశ్వాస్ డానియల్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సంగీతం: సామ్ సి ఎస్
నిర్మాతలు: విక్రమ్ మెహ్రా, సిద్దార్ధ్ ఆనంద్ కుమార్, జోజో జోస్, రవి, రాకేష్ రెడ్డి
బ్యానర్: శివమ్ సెల్యులాయిడ్స్
'క' లాంటి విభిన్నమైన మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం హోలీ కానుకగా 'దిల్ రుబా' అనే మూవీతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా, ప్రచార చిత్రాలు, వాటిల్లోని డైలాగ్స్ తో 'దిల్ రుబా' పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
సిద్దు(కిరణ్ అబ్బవరం), మ్యాగీ(కథి దేవిసన్) చిన్నవయసు నుంచే మంచి స్నేహితులతో పాటు ప్రేమికులు కూడా కావడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ సిద్దు తండ్రి(ఆనంద్) హఠాన్మరణంతో మ్యాగీ వేరే అతన్నిపెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సిద్దు బెంగుళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరతాడు. అంజలి (రుక్సర్ థిల్లన్) అనే తోటి క్లాస్ మేట్ సిద్దు మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. తన జీవితంలో ప్రేమ అనేది లేదని మొదట్లో చెప్పిన సిద్దు ఆ తర్వాత అంజలిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. ఈ విషయం ప్రెగ్నెంట్ తో ఉన్న మ్యాగీ కి చెప్తాడు. అంజలి,సిద్దు మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేక్ అప్ అవుతారు. దీంతో మ్యాగీ బెంగుళూర్ వచ్చి అంజలి, సిద్దుని కలపాలని చూస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న అంజలి, సిద్దు ఎందుకు విడిపోయారు? మ్యాగీ ఎందుకు ఆ ఇద్దర్ని కలపాలని చూస్తుంది? అసలు ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా యుఎస్ నుంచి సిద్దు లైఫ్ కోసం వచ్చిన మ్యాగీ మరి సిద్దుని ఎందుకు వదిలేసింది? సిద్దు ఎవరు? అతని కుటుంబనేపథ్యం ఏంటి? డ్రగ్ డీలర్ జోకర్ కి ఈ కథ కి సంబంధం ఏంటి? సిద్దు,అంజలి కలిసారా లేదా అనేదే ఈ కథ.
ఎనాలసిస్ :
'దిల్ రుబా' చూస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల 'జల్సా' గుర్తుకొస్తుంటుంది. ఏది ఏమైనా 'దిల్ రుబా' అంతగా తీసి పారేయాల్సిన మూవీ అయితే కాదు. హీరోతో పాటు హీరోయిన్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల కంటే ఇందులోని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ లోనే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయో తెలిసింది. అందుకు తగ్గట్టుగానే చివరి దాకా ఉన్నాయి. నటీనటులు అందరు కూడా తమ క్యారక్టర్ కి, కథకి తగ్గట్టుగా నటించి ఎక్కడ బోర్ కొట్టకుండా చేసారు. కథ, కథనాలు గతంలో చాలా చిత్రంలో వచ్చినవే కావడం మాత్రమే ఈ చిత్రానికి మైనస్.
ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే టైటిల్స్ బిగినింగ్ నుంచే మూవీపై మేకర్స్ క్యూరియాసిటీ కలిగించారు. సిద్ధు బెంగుళూర్ కాలేజీలో ఎంటర్ అవ్వడం, సిద్దు యాటిట్యూడ్ నచ్చి అంజలి ఇష్టం పెంచుకొని తన వెనకాలే పడటం వంటి సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆ తర్వాత అంజలి ప్రేమంటే ఇష్టం లేని సిద్దు, ఆమెను ప్రేమించే రీజన్ కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది. సత్య కామెడీతో పాటు కథ నడిచిన విధానం కూడా వర్క్ అవుట్ అయ్యింది. కాకపోతే ఇంటర్వెల్ టైంకి సిద్దు, అంజలి విడిపోయే కారణమే కొంచెం అతిగా అనిపిస్తుంది. ఎందుకంటే సిద్దు, అంజలి ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించే మనుషులు. అంజలి అయితే సిద్దు కంటే కూడా ఫాస్ట్ అని చెప్పవచ్చు. అలాంటి అంజలి ఎవరో ఒకరి వల్ల సిద్దు ని అపార్ధం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా అందుకు కారణమైన వ్యక్తి అంజలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంటే, సిద్దు కాపాడతాడు. కథ కోసం కావాలని అంజలి, సిద్దు మధ్య మనస్పర్థలు రావాలని చెప్పినట్టుగా ఉంది. ఇదే లాజిక్ మ్యాగీ, సిద్దు లవ్ కి కూడా వర్తిస్తుంది. మ్యాగీ, సిద్దు మధ్య కాకపోయినా.. అంజలి, సిద్దు మధ్య అయినా బ్రేక్ అప్ కావడానికి చాలా బలమైన రీజన్ సెట్ చేసుండాల్సింది. అసలు సిద్దుకి ఉన్న డిఫరెంట్ యాటిట్యూడ్ చూసే అంజలి ప్రేమిస్తుంది కదా. అసలు పవిత్రమైన ప్రేమ అర్ధం పర్థం లేని కారణానికే విడిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది. జాన్ విజయ్ ని ఫస్ట్ హాఫ్ లో కూడా యూజ్ చేసుకోవాల్సింది.
సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో తనని ప్రేమించమని అంజలి ఏ విధంగా అయితే తిరిగిందో సిద్దు అదే విధంగా అంజలి వెంట తిరుగుతాడు. దీంతో రిపీటెడ్ సీన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అంజలి,సిద్దు ని కలపాలని యుఎస్ నుంచి ప్రెగ్నెంట్ తో ఉన్న మ్యాగీ రావడం, సిద్దుతో ఉండటం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. కాకపోతే కాలేజ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ప్రేక్షకులకి సెకండ్ హాఫ్ లో కూడా ఫస్ట్ హాఫ్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. పైగా నటినటులు కూడా వాళ్లే. సిద్దు పై డ్రగ్ డీలర్ జోకర్ పగ పెంచుకునే పాయింట్ బాగుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులకి తెలిసిపోతుంది. అంజలి,సిద్దు కలవడం ఖాయమని కూడా క్లైమాక్స్ కి చాలా ముందే అర్థమైపోతుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
సిద్దు క్యారక్టర్ లో కిరణ్ అబ్బవరం విజృంభించి నటించాడు. ప్రేక్షకులకి కేవలం సిద్దు క్యారక్టర్ మాత్రమే కనపడేంతలా లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని వేరియేషన్స్ లోను తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. హీరోయిన్లుగా చేసిన రుక్సర్ థిల్లన్, కథి దేవిసన్ బెస్ట్ పెర్ఫార్మెన్సు ఇచ్చారు. ముఖ్యంగా రుక్సర్ అయితే తన యాక్టింగ్ తో ప్రేక్షకులని కట్టి పడేసింది. ఇంకా మంచి అవకాశాలు వస్తే తెలుగు తెరపై తన సత్తా చాటగలదు. సత్య, జాన్ విజయ్, రుక్సర్ తండ్రిగా చేసిన ఆడుకాలం నరేన్, సీనియర్ నటీమణి తులసి ఇలా అందరు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
చాలా సినిమాల్లో చూసిన కథ, కథనాలుతో దిల్ రుబా తెరకెక్కడం అనేది మైనస్ గా పరిగణించవచ్చేమో. గాడ్ కంటే గొప్పదైన ప్రేమ చిన్న కారణనానికే విడిపోతే అది ప్రేమ ఎలా అవుతుందనే విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరేమో. ఏది ఏమైనా తుది తీర్పు ప్రేక్షకులదే .
- అరుణాచలం