![]() |
![]() |

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ నిజాలు కంటే అబద్దాలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అతికినట్టుగా అబద్ధాలు చెప్పే వారికి ఈ రంగం బాగా కలిసి వస్తుంది. పెద్దగా క్రేజ్ లేనప్పుడు ఎవరైనా నిర్మాత వచ్చి అడిగితే హీరోలు దర్శకులు ఓకే చెప్పి అడ్వాన్స్ తీసుకుంటారు. ఆ తరువాత అదృష్టవశాత్తు వారి చిత్రాలు పెద్ద ఘన విజయం సాధించి వారు స్టార్ హోదా స్థాయికి ఎదిగితే ముందుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోరు. నిన్న ఇచ్చిన నోటి మాట పక్కరోజుకు మారిపోతుంది. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలను పక్కనపడేసి తమకు ఉన్న క్రేజ్ కు తగ్గట్టుగా ఎక్కువ పారితోషం ఇచ్చే నిర్మాతలకు ఓకే చెబుతుంటారు. అంటే ఏదైనా మొదట్‌లో ఇచ్చిన మాట ఒకటి అయితే సక్సెస్ లో తేలియాడుతున్న సమయంలో వారి నుండి వచ్చే మాట మరో విధంగా ఉంటుంది. ఇలా సినీ ప్రపంచం ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటూ ఉంటుంది.
విషయానికి వస్తే దర్శక ధీరుడు రాజమౌళి కి ప్రముఖ నిర్మాత నారాయణ ఓ చిత్రం కోసం అడ్వాన్స్ ఇచ్చాడు. అది కూడా పదేళ్ల కిందటి మాట. ఆనాడు రాజమౌళి ఏమి పెద్ద దర్శకుడు కాదు. ఆయన పేరు కేవలం తెలుగులో మాత్రమే పరిచయం. కానీ ఆయన మీద నమ్మకంతో కెఎన్ నారాయణ మహేష్ బాబు-రాజమౌళిలతో చిత్రం చేయాలని భావించి మాట తీసుకున్నాడు. కానీ పదేళ్ల కిందట రాజమౌళి రేంజ్ వేరు. కానీ ప్రస్తుతం ఆయన మన దేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు. వరల్డ్ స్థాయిలో పాపులర్ అయ్యాడు. హాలీవుడ్ డైరెక్టర్స్ అయినా ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్‌ల దాకా రాజమౌళి ఇమేజ్ ఇనుమడించింది. వారితో కలిసి సంభాషించే సమాన స్థాయికి ఆయన ఎదిగాడు.
కానీ దుర్గా ఆర్ట్స్ కోసం కే ఎల్ నారాయణ నిర్మాతగా మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం చేస్తానని తానిచ్చిన పదేళ్ల కిందటి మాటమీద రాజమౌళి ఇప్పటికీ నిలబడి ఉన్నాడు. త్వరలో రాజమౌళి దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మాతగా మహేష్ బాబు హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు వరల్డ్ ట్రావెలర్ పాత్రను పోషిస్తున్నాడు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ చిత్రం రూపొందనుంది. దీనికి సినిమాటిక్ యూనివర్స్ నేపధ్యంలో పలు భాగాలు ఉండబోతున్నాయని సమాచారం.
నేడు రాజమౌళి చిత్రం చేస్తానంటే బ్లాంక్ చెక్‌లను కూడా ఇవ్వడానికి ఎందరో సిద్దం. అంతదాకా ఎందుకు ఆయనతో చిత్రాలు చేయడానికి పలు అంతర్జాతీయ సినీ నిర్మాణ సంస్థలు సిద్దంగా ఉన్నాయి. కానీ రాజమౌళి మాత్రం నారాయణకి పదేళ్ల కిందట ఇచ్చిన మాటకి కట్టుబడి మహేష్ తో దుర్గా ఆర్ట్స్ బేనర్‌లోనే ఓ చిత్రం ప్రారంభించనున్నారు. ఇక దుర్గా ఆర్ట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఆ సంస్థ తరుణ్ హీరోగా నిన్నే ఇష్టపడ్డాను, జగపతిబాబు-సౌందర్య లతో దొంగాట, వెంకటేష్- సౌందర్య లు జంటగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఇంట్లో ఇల్లాలు -వంటింట్లో ప్రియురాలు, నాగార్జున అక్కినేని- రమ్యకృష్ణ- సౌందర్య కాంబోలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో హలో బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్- ఇలియానా- చార్మిల తో కృష్ణవంశీ దర్శకత్వంలో రాఖీ, వెంకటేశ్-శ్రీదేవిల తో వర్మా దర్శకత్వంలో క్షణక్షణం, నాగార్జున- శ్రియ శరన్ జంటగా దశరథ దర్శకత్వంలో సంతోషం వంటి చిత్రాలను నిర్మించింది. కాగా ఎస్ ఎస్ ఎం బి 29 చిత్రం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతూ ఉండడంతో ఈ సంస్థ నేషనల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సాధిస్తుందని చెప్పవచ్చు.
![]() |
![]() |